Dhulipalla Narendra : వసూలు రాజా సజ్జల చెప్పేవన్నీ అబద్దాలే, మీలా అందరు దోపిడీదారులని అనుకుంటున్నారా..? : ధూళిపాళ నరేంద్ర

సజ్జల ఓ వసూలు రాజా. గుజరాత్ ప్రభుత్వంతో సీమెన్స్ ప్రాజెక్టు మొదలైంది.గుజరాత్ ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.

Dhulipalla Narendra : వసూలు రాజా సజ్జల చెప్పేవన్నీ అబద్దాలే, మీలా అందరు దోపిడీదారులని అనుకుంటున్నారా..? : ధూళిపాళ నరేంద్ర

Dhulipalla Narendra

Dhulipalla Narendra : చంద్రబాబు అరెస్ట్ గురించి..ఆయన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో స్కామ్ కు పాల్పడ్డారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా అసత్యాలు చెబుతున్నారు అంటూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర మండిపడ్డారు. సజ్జల ఓ వసూలు రాజా అంటూ ఎద్దేవా చేశారు.గుజరాత్ ప్రభుత్వంతో సీమెన్స్ ప్రాజెక్టు మొదలైందని..గుజరాత్ ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు.తెలంగాణ, చత్తీస్ ఘడ్, ఏపీ సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకుందని తెలిపారు.ఎనిమిది రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్న సీమెన్స్ ఇండియా సంస్థకు దాని మాతృ సంస్థతో సంబంధం లేదని సజ్జల చెబుతున్నారు.. ఇది అసత్యమని అన్నారు. సీమెన్స్ ఇండియా మాతృ సంస్థను ప్రభుత్వం బెదిరించిందని..రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులతోనే సీమెన్స్ ఇండియాతో సంబంధం లేదని ఆ మాతృ సంస్థ అఫిడవిట్ ఇచ్చిందని విమర్శించారు.

Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ తరువాత దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి .. ఏపీ ప్రజలకు విజ్ఞప్తి

యోగేష్ గుప్తా అనే వ్యక్తి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని…స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో చేసుకున్న ఒప్పందంతో యోగేష్ గుప్తాకు సంబంధమే లేదని స్పష్టంచేశారు.డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన యోగేష్ గుప్తాను కూడా బెదిరించారని ఆరోపించారు. 30 సెంటర్లు.. ఆరు ఎక్సలెన్స్ సెంటర్లు.. 2.14 లక్షల మంది ట్రైనింగ్ తీసుకున్న పిల్లలున్నారు..మేం ట్రైనింగ్ ఇచ్చామా..? లేదా..? అనేది ట్రైనింగ్ తీసుకున్న పిల్లలను అడిగితే తెలుస్తుందన్నారు.ప్రాజెక్టు అమలు కోసం వేసిన కమిటీలో ఉన్న అధికారుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారా..?అధికారుల నుంచి స్టేట్మెంట్ తీసుకోకుండా.. చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేశారు..?అని ప్రశ్నించారు.

Nara Lokesh : నా తండ్రిని అరెస్ట్ చేస్తే నన్ను రెస్ట్ తీసుకోమంటారా..? అంటూ పోలీసులపై లోకేశ్ ఫైర్

వైసీపీ నేతలు నిత్యం దొపిడీ, దందాలతో బతికేవాళ్లు.. వాళ్లవలెనే అందరు ఉంటారని వారి అనుకుంటున్నారని విమర్శించారు. వాళ్లవలెనే మిగిలిన వారంతా ఉన్నారని అనుకుంటున్నారని కానీ చంద్రబాబు రాజకీయం.. జీవితం తెరిచిన పుస్తకం..ఈ విషయం దోపిడీదారులకు ఏం తెలుస్తుంది..? అంటూ ఎద్దేవా చేశారు.నిజాయితీ ఉంటే చంద్రబాబుకు నోటీసిచ్చి విచారణకు పిలవొచ్చుగా..?విచారణకు పిలవకుండా అరెస్ట్ ఏంటీ..?అంటూ మండిపడ్డారు. తనకే అంతా తెలిసినట్టు కొల్లి రఘురామి రెడ్డి మా లాయర్లను కించపరిస్తున్నారు అంటూ ధూళిపాల ఫైర్ అయ్యారు.