Nara Lokesh : నా తండ్రిని అరెస్ట్ చేస్తే నన్ను రెస్ట్ తీసుకోమంటారా..? అంటూ పోలీసులపై లోకేశ్ ఫైర్

అరెస్ట్ అయిన తండ్రి వద్దకు వెళ్లకూడదని పోలీసులు అడ్డుకోవటంతో నారా లోకేశ్ రోడ్డుమీదనే బైఠాయించి నిరసన చేస్తారు. చంద్రబాబును అరెస్ట్ చేయటం..లోకేశ్ ను అడ్డుకోవటంతో పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Nara Lokesh : నా తండ్రిని అరెస్ట్ చేస్తే నన్ను రెస్ట్ తీసుకోమంటారా..? అంటూ పోలీసులపై లోకేశ్ ఫైర్

Nara Lokesh Serious On Police

Chandrababu Arrest : టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో  యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేశ్ తన తండ్రిని కలిసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మీరు రెస్ట్ తీసుకోండి అంటూ లోకేశ్ కు సూచించారు. దీంతో పోలీసులతో లోకేశ్ వాగ్వాదానికి దిగారు. నా తండ్రిని అరెస్ట్ చేస్తే నేను రెస్ట్ తీసుకోవాలా..? అంటూ మండిపడ్డారు. రోడ్డుమీదనే బైఠాయించారు.

కాగా ఇటు చంద్రబాబు అరెస్ట్..అటు జగన్ లండన్ టూర్ విషయంపై లోకేశ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

లోకేశ్ రోడ్డుమీదనే బైఠాయించి నిరసన చేస్తుండటంతో యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి నోటీసులు లేకుండా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. లోకేశ్ వద్దకు మీడియాను కూడా అనుమతించడంలేదని సమాచారం. పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు, ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్

మరోపక్క చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తు ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసులు టీడీపీ అగ్రనేతలతో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నిరసనలు పెరగకుండా ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.