25000 preventive arrests made by police two weeks in gujarat
25K People Arrest: గుజరాత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే 25,000 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లపై దృష్టిసారించారు. డబ్బు, మద్యం ప్రభావాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నవంబర్ 3 నుంచి ఇప్పటివరకు 25,000 లకు పైగా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎక్కువమంది కత్తులు లేదా కర్రలు కలిగివున్నవారేనని పోలీసులు తెలిపారు. వీరంతా వేర్వేరు కేసుల్లో అరెస్టవ్వడం లేదా డబ్బు లేదా మద్యం పంపిణీ చేసిన చరిత్ర ఉందని వెల్లడించారు.
అరెస్టైన వారిలో ఎక్కువమంది అహ్మదాబాద్, సూరత్ నగరాలకు చెందినవారే. ఓటర్ల భద్రత, స్వచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలానుసారం వీరిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. సీఆర్‌పీసీ, ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్టు వారు వెల్లడించారు. గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లో సూరత్‌లో అత్యధికంగా 12,965 అరెస్టులు జరగగా.. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 12,315 మంది అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఇక వడోదరలో 1,600 ముందస్తు అరెస్టులు జరిగినట్లు తెలిపారు.
Veer Savarkar: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేస్తానంటున్న వీర్ సావర్కర్ మనవడు