Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. తీవ్ర రాజకీయ ప్రచారంలో ఎన్నికల విభాగాలు కూడా చురుగ్గా పని చేస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమయంలో పోలీసులు కూడా నిరంతర చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉదయ్‌పూర్‌లో బుధవారం అర్థరాత్రి పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నిషేధించబడిన డ్రగ్స్ పెద్ద మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ చర్యలో భాగంగా 5000 కంటే ఎక్కువ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు. ఎన్నికల సందర్భంగా యువతకు సరఫరా చేయడానికే ఇది రవాణా చేస్తున్నట్లు సమాచారం.
ఉదయ్‌పూర్ నగరంలోని గోవర్ధన్ విలాస్ పోలీస్ స్టేషన్ ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. నగరానికి సమీపంలోని కురాబాద్‌కు చెందిన ప్రకాష్ పటేల్ అనే వ్యక్తి గతి ఎక్స్‌ప్రెస్ అండ్ సప్లయ్ చైన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లాక్ ఎ ట్రాన్స్‌పోర్ట్ నగర్ బలిచా ద్వారా డ్రగ్ కోడైన్‌తో కూడిన వస్తువులను ఆర్డర్ చేసినట్లు ఇన్‌ఫార్మర్ నుంచి పోలీసు అధికారి అజయ్‌సింగ్‌రావుకు సమాచారం అందింది. ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో ఉన్న గతి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం ఉంది. సమాచారం అందుకున్న బృందం ఘటనా స్థలానికి చేరుకుని డ్రగ్ కంట్రోల్ అధికారిని కూడా పిలిపించారు. గోదాంలో తనిఖీ చేయగా 50 కార్టన్‌ల కొడైన్ సిరప్ లభ్యమైంది. వాటిని తెరిచి లెక్కించిగా 5000 కంటే ఎక్కువ సీసాలు ఉన్నాయి. ఇందులో కోడైన్ ఫాస్ఫేట్, ఓపియం డెరివేటివ్, NDPS లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: CM Hospitalised : అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన హిమాచల్ ప్రదేశ్ సీఎం, అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఏం చెప్పారంటే..
పోలీసుల బృందం స్వాధీనం చేసుకున్న నిషేధిత డ్రగ్ కోడైన్ లో నల్లమందు ఉండడంతో ప్రస్తుతం ఈ డ్రగ్ ను మత్తుగా వాడుతున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం యువతపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్న ఈ మందును చాలా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మత్తుగా వాడుతున్నారు. ఇక ఇదే కేసుకు సంబంధిచి మెడికల్ స్టోర్ నిర్వాహకుడు ప్రకాష్ పటేల్‌ను అరెస్టు చేశారు.