Telangana Polls: తెలంగాణలో 594 అప్లికేషన్లు రిజెక్ట్.. లిస్టులో జానారెడ్డి, ఈటెల జమున

అప్లికేషన్లను తిరస్కరించడంపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన జానారెడ్డి అప్లికేషన్ తిరస్కరించడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది

Assembly Elections 2023: తెలంగాణలో నామినేషన్ల పర్వం 10వ తేదీతో ముగిసింది. కాగా, ఈరోజు (నవంబర్ 13) నామినేషన్ల పరిశీలన పూర్తైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 5563 అప్లికేషన్లు వచ్చాయి. కాగా, ఇందులో కేవలం 2444 అప్లికేషన్లను మాత్రమే ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇక 594 మంది అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఈటెల రాజెందర్ సతీమణి జమున అప్లికేషన్లు కూడా ఉండడం గమనార్హం. ఇకపోతే ఎంత మంది అప్లికేషన్లు ఉపసంహరించుకున్నారు, చివరి పోటీలో ఎంత మంది ఉన్నారో వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

అప్లికేషన్లను తిరస్కరించడంపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన జానారెడ్డి అప్లికేషన్ తిరస్కరించడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ తరపున ఈటెల జమున వేసిన నామినేషన్ కూడా తిరస్కరించారు. బీఫాం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. ప్రతి ఎన్నికలో ఈటెలతో పాటుగా నామినేషన్ వేస్తున్నారు.