A polling booth with 8 staff for a single voter
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. కాగా, సాయంత్రం 5 గంటల వరకు 56.88 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఈ తొలి దశ పోలింగులో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఒకే ఒక్క ఓటర్ కోసం ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆ బూతులో ఎనిమిది మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని బనేజ్ ప్రాంతంలోని ఉనా నియోజకవర్గంలో ఉన్న అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బూత్ అది. మహంత్ హరిదాస్ జీ ఉదాసీన్ అనే ఓటర్ ఆ బూతులో ఈరోజు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
Mayabazar – Premadesam : రీ రిలీజ్‌కి సిద్దమవుతున్న మాయాబజార్, ప్రేమదేశం సినిమాలు..
కాగా, హరిదాస్ ఓటు వేసిన విషయాన్ని, అతడి కోసం చేసిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అతడు ఓటు వేసిన ఫొటోలను షేర్ చేస్తూ ‘‘మహంత్ హరిదాస్ జీ ఉదాసీన్ అనే ఒకే ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేశాం. గిర్ ప్రాంతంలోని అడవిలో అతడు నివాసం ఉంటాడు. హరిదాస్ ఓటు వేసే సమయంలో చాలా గర్వంగా అనిపించింది’’ అని రాసుకొచ్చారు. వాస్తవానికి అక్కడ పోలింగ్ బూత్ హరిదాస్ తండ్రి మహంత్ భరత్ దాస్ కోసం ఏర్పాటు చేశారట. అప్పట్లో ఆయనొక్కరే వచ్చి ఓటేసి వెళ్లిపోయేవారట. అయితే ఆయన మరణంతో బూతును తొలగిద్దామని అనుకున్నటప్పటికీ.. ఆయన కుమారుడు హరిదాస్ ఓటరుగా మారడంతో అలాగే ఉంచినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.
Chiru-Balayya : బాలయ్య, చిరు మల్టీస్టారర్ పై స్పందించిన అల్లు అరవింద్