MCD Polls: పార్టీ టికెట్ ఇవ్వలేదని టెలిఫోన్ టవర్ ఎక్కిన ఆప్ నేత

నేను బతికుండొచ్చు, చనిపోవచ్చు. ఈరోజు నాకేది జరిగినా అందకు పూర్తి బాధ్యత ఆప్ నేతలు దుర్గేష్ పాఠక్, అతిశిలదే. వాళ్లు నా నుంచి ఒరిజినల్ డాక్యూమెంట్లు తీసుకున్నారు. అందులో నా బ్యాంకు పాస్ బుక్ కూడా ఉంది. రేపే నామినేషన్ వేయడానికి చివరి రోజు. కానీ నా డాక్యూమెంట్లు ఇచ్చేలా లేరు. ఈరోజు డాక్యూమెంట్లు నాకు అందకపోతే ఇక్కడి నుంచి దూకి చనిపోతాను

AAP leader climbs tower for denied ticket

MCD Polls: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని ఆదివారం టెలిఫోన్ టవర్ ఎక్కాడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక నాయకుడు. హసీబ్ ఉల్ హసన్, తూర్పు ఢిల్లీ నుంచి మాజీ కౌన్సిలర్. వచ్చే ఎంసీడీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా ఆప్ నేతలు అతిశి, దుర్గేష్ పాఠక్ అడ్డుకున్నారని, తన నుంచి తీసుకున్న డాక్యూమెంట్లను సైతం తిరిగి ఇవ్వడం లేదని హసన్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎత్తైన టవర్ ఎక్కిన హసన్, తన ఫోన్‭లోనే ఫేస్‭బుక్ లైవ్ పెట్టారు. టవర్ కింది వైపుకు చూపిస్తూ తాను ఎంత పైకి ఎక్కానో చెప్పారు. ఆప్ నేతలు దుర్గేష్, అతిశిలపై ఆరోపణలు చేస్తూ.. తనకు టికెట్ ఇవ్వకపోతే టవర్ మీద నుంచి దూకి చనిపోతానని బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఇది జరిగి గంటలకు గడుస్తున్నా ఆప్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

ఫేస్‭బుక్ లైవ్‭లో ‘‘నేను బతికుండొచ్చు, చనిపోవచ్చు. ఈరోజు నాకేది జరిగినా అందకు పూర్తి బాధ్యత ఆప్ నేతలు దుర్గేష్ పాఠక్, అతిశిలదే. వాళ్లు నా నుంచి ఒరిజినల్ డాక్యూమెంట్లు తీసుకున్నారు. అందులో నా బ్యాంకు పాస్ బుక్ కూడా ఉంది. రేపే నామినేషన్ వేయడానికి చివరి రోజు. కానీ నా డాక్యూమెంట్లు ఇచ్చేలా లేరు. ఈరోజు డాక్యూమెంట్లు నాకు అందకపోతే ఇక్కడి నుంచి దూకి చనిపోతాను’’ అని హసన్ అన్నారు.

వాస్తవానికి తాను పోటీ నుంచి తప్పుకుంటానని, అయితే తన డాక్యూమెంట్లు మాత్రం తనకు కావాలని కాసేపటికి హసన్ చెప్పారు. ఈ ఏడాది చివరలో కూడా హసన్ వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ సమీపంలోని డ్రైనేజీలో ఒక్కసారిగా దూకి శుభ్రం చేశారు. చాతి వరకు డ్రైనేజీ బురదలో మునిగిపోయిన ఆయన, అందులోని చెత్తను తీసే ప్రయత్నం చేశారు.

Patanjali: రాందేవ్ బాబాకు షాక్.. ఆ ఐదు ఉత్పత్తులు నిలిపివేయాలంటూ ఆదేశాలు