Karnataka Polls: సౌత్ ఇండియా నుంచి బీజేపీ ఔట్..! ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట హవా

తాజాగా కర్ణాటకలో సైతం బీజేపీ ఓడిపోవడంతో దక్షిణాది నుంచి బీజేపీ వైట్ వాష్ అయిందని విమర్శకులు అంటున్నారు. ఇక బీజేపీ గిట్టని నెటిజెన్లు అయితే ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట్లో హల్‭చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‭ట్యాగ్ ట్విట్టర్‭లో టాప్ ట్రెండింగులో్ కొనసాగడం గమనార్హం.

#BJPMuktSouthIndia: భారతీయ జనతా పార్టీకి దక్షిణాది పట్టున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఉత్తరాది మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. అయితే దక్షిణ భారతానికి ప్రవేశ ద్వారంగా కర్ణాటక ఎప్పటి నుంచో ఉంది. పలుమార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2014 నుంచి మోదీ హవా దేశంలో కొనసాగినప్పటికీ దక్షిణ భారతంలో కర్ణాటకను మాత్రం దాటలేకపోయింది.

అయితే తాజాగా కర్ణాటకలో సైతం బీజేపీ ఓడిపోవడంతో దక్షిణాది నుంచి బీజేపీ వైట్ వాష్ అయిందని విమర్శకులు అంటున్నారు. ఇక బీజేపీ గిట్టని నెటిజెన్లు అయితే ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట్లో హల్‭చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‭ట్యాగ్ ట్విట్టర్‭లో టాప్ ట్రెండింగులో్ కొనసాగడం గమనార్హం. కొందరు మతత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు హిజాబ్ అంశాన్ని లేవనెత్తుతున్నారు. పెరియార్ లాంటి వారిని ఉదహరిస్తూ కొందరు బీజేపీని ట్రోల్ చేస్తున్నారు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న కొన్ని ట్వీట్లు..