Assembly Elections 2023: ఒక్కసారిగా కారెక్కి తొడ కొట్టడం ప్రారంభించిన అభ్యర్థి.. తర్వాత ఏం చేశారంటే?

అఖాడాలో కుస్తీ పట్టే మల్లయోధులు తరచుగా ఈ భంగిమలో కనిపిస్తారు. ప్రత్యర్థి రెజ్లర్‌పై తొడలు కొట్టడం కనిపిస్తుంది. అదే పద్ధతిలో, టాండన్ తనను తాను బలమైన ఎన్నికల రెజ్లర్‌గా నిరూపించుకోవడానికి ప్రయత్నించారు.

Madhya Pradesh Politics: తొడ కొట్టే ఛాలెంజులు సినిమాల్లో చూస్తూ ఉంటాం. రియల్ లైఫులో ఎప్పుడో ఎక్కడో కానీ కనిపించవు. రాజకీయాల్లో కూడా మాటలు ఉంటాయి కానీ, చేతల్లో కనిపించవు. రాజకీయాల్లో లీడర్ తొడకొట్టడం చూడకపోతే ఇప్పుడు మీకు చూపిస్తాం. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో తొడ కొట్టే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దామోహ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ టాండన్‌ బహిరంగంగా పలుమార్లు తొడ కొట్టి ఈ ఎన్నికల్లో సత్తాతో పోరాడుతామని ఛాలెంజ్ విసిరారు.

నామినేషన్‌ పత్రాల దాఖలుకు చివరి రోజైన సోమవారం కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ టాండన్‌ భారీగా మద్దతుదారులతో కలెక్టరేట్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. టాండన్ బహిరంగ జీపు మీద నిలబడి ప్రజల శుభాకాంక్షలను స్వీకరిస్తున్నారు. ఇంతలో ఉత్కంఠ పెరిగిపోయి ఒక్కసారిగా జీపుపైకి వచ్చారు. ఈ సమయంలో, అజయ్ టాండన్ బ్యాండ్ ట్యూన్‌కి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు, కొద్దిసేపటికే ఆయన తొడ కొట్టడం ప్రారంభించారు.

అఖాడాలో కుస్తీ పట్టే మల్లయోధులు తరచుగా ఈ భంగిమలో కనిపిస్తారు. ప్రత్యర్థి రెజ్లర్‌పై తొడలు కొట్టడం కనిపిస్తుంది. అదే పద్ధతిలో, టాండన్ తనను తాను బలమైన ఎన్నికల రెజ్లర్‌గా నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ ఫీట్ చూసిన వారు కంగుతిన్నారు. తొడ కొట్టడంపై అజయ్ టాండన్ స్పందిస్తూ.. “నేను ఆటగాడిని. బీజేపీ నేతలను ఆ ఆట చూపిస్తాను. ఈ గేమ్‌లో కాంగ్రెస్ గెలుస్తుంది” అని అన్నారు. అయితే టాండన్ తొడ కొట్టడంపై బీజేపీ అభ్యర్థి జయంత్ మలయ్య చురకలంటించారు. తనకు ఇంకా డ్యాన్స్ చేసే వయసు రాలేదని టాండన్ ను ఉద్దేశించిన అన్నారు.