Assembly Eelctions 2023: హతవిధీ.. ఎన్నికల్లో గెలుపు కోసం ఫకీరుతో చెప్పు దెబ్బలు తిన్న కాంగ్రెస్ నేత

సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పరాస్.. ఫకీర్ బాబాకు చెప్పులు బహుమతిగా ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఆయనను ఫకీర్ బాబా అదే చెప్పులతో కొట్టడం కూడా చూడొచ్చు.

ఎన్నికల్లో గెలవడానికి ప్రజల మన్ననలు పొందేందుకు అభ్యర్థులు నానా రకాల ఫీట్లు వేస్తుంటారు. ఇందులో భాగంగా బాబాలు, ఫకీర్ల వంటి వారి సహాయం కూడా తీసుకుంటారు. అయితే ఆశీర్వాదం తీసుకోవడం వేరు కానీ, వారి చేత చెప్పులు దెబ్బతు తినడం మాత్రం కొత్తగానే ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం అసెంబ్లీ నియోజకవర్గంలో తాజాగా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పరాస్ సక్లేచా ఒక ఫకీర్ బాబా దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్లారు. అతడికి తన చేతితోనే కొత్త చెప్పులు ఇచ్చి, వాటి చేతనే దెబ్బలు తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


రత్లాం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పరాస్.. ఫకీర్ బాబాకు చెప్పులు బహుమతిగా ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఆయనను ఫకీర్ బాబా అదే చెప్పులతో కొట్టడం కూడా చూడొచ్చు. ఫకీర్ బాబా దీవెనలు అందించే తీరు అద్వితీయమని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. బాబా తీరు, ఆయన ఆశీస్సులు ఎంత ఫలిస్తాయనే చర్చల్లో పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు కూడా ఈ బాబా ఆశీస్సులు పొందేందుకు క్యూ కడతారని అంటున్నారు. బాబా నగర శివార్లలోని మోవ్ రోడ్‌లో రోడ్డు పక్కన ఒక స్టూల్‌పై కూర్చుని, ఈ ప్రత్యేకమైన శైలిలో అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఫకీర్ బాబా చేతిలో దెబ్బలు తినాలని తహతహలాడుతుంటార. ప్రముఖులు, డబ్బున్న వారు కూడా ఇక్కడికి వస్తుంటారు.