Rajasthan Polls: రాజస్థాన్ ఎన్నికల పోరులో భిన్నమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. టిక్కెట్ల పంపిణీ గురించి మాట్లాడితే, కాంగ్రెస్‌లో ఇంకా చాలా మంది పేర్లు పెండింగులో ఉన్నాయి. కోట డివిజన్‌లో అనేక అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. కాగా, జాబితాలో తమ పేర్లు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ బ్యానర్‌పై నామినేషన్లు వేసిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. కోట సౌత్ నుంచి రాఖీ గౌతమ్, పిపాల్డా అసెంబ్లీ నుంచి సరోజ్ మీనాలు కాంగ్రెస్ అభ్యర్థులగా తమ నామినేషన్లను దాఖలు చేశారు.
నయీముద్దీన్ గుడ్డు కూడా తన పేరు ప్రకటించకముందే నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజా జాబితాలో ఆయన పేరు వచ్చింది. కాగా, కోట నార్త్ నుంచి ప్రహ్లాద్ గుంజాల్ పేరు జాబితాలో కనిపించలేదు. ఆయన కూడా పూర్తి బలంతో నామినేషన్ దాఖలు చేశారు. కోట డివిజన్‌తో పాటు రాజస్థాన్‌లోని అత్యంత హాట్‌సీట్‌గా పరిగణించబడుతున్న కోట నార్త్ అసెంబ్లీలో పేరు ఇంకా ఖరారు కాలేదు. నామినేషన్లకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. అయితే శాంతి ధరివాల్ టికెట్ దాదాపు ఖరారైందని, అయితే ఆయన తన కుమారుడికి టికెట్ అడుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
కోటా సౌత్ నుంచి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు రాఖీ గౌతమ్ మాట్లాడుతూ.. అధిష్టానం సూచన మేరకే కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. ఇక సీఎం చెప్పినందుకే లాడ్‌పురా అసెంబ్లీ నుంచి నయీముద్దీన్ గుడ్డు నామినేషన్ దాఖలు చేశారని చెప్పారు. సరోజ్ మీనా కూడా పిపాల్డా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీనితో పాటు కోట నార్త్, కోటా సౌత్, రామ్‌గంజ్‌మండి, పిపాల్డాతో సహా అనేక నియోజకవర్గాలతో పాటు చాలా స్థానాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.