Karnataka Polls: కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాలంటూ కమల్ హాసన్‭ను కోరుతున్న హస్తం నేతలు

224 స్థానాలున్న కర్ణాటకలో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2,427 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 184 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా ఇద్దరు అభ్యర్థులు ఇతరులు ఉన్నారని కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇక గుర్తింపు పొందిన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను సైతం తెలిపారు

Kamal Haasan

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయమంటూ మక్కల్ నీది మయ్యం చీఫ్, తమిళ అగ్ర హీరో కమల్ హాసన్‭కు విజ్ణప్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఇప్పటికే కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా మరో నటుడు దర్శన్ కూడా కాషాయ పార్టీకి ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో సినీ గ్లామర్ చూపించాలని కాంగ్రెస్ సైతం భావిస్తోంది.

Anji Khad Bridge: ప్రారంభానికి సిద్ధమవుతున్న దేశంలో తొలి తీగల రైల్వే వంతెన.. ఎక్కడ ఉంది? ప్రత్యేకతలు ఏమిటంటే..?

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి కమల్ హాసన్ పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడులోని ఈరోడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్‭కు మద్దతు ఇచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రం ఢిల్లీకి చేరుకోగానే ఆ యాత్రలో కమల్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దీంతో తమ పార్టీ కోసం కమల్‭ను ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Jammu and Kashmir Earthquake: జమ్మూ‌కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదు

224 స్థానాలున్న కర్ణాటకలో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2,427 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 184 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా ఇద్దరు అభ్యర్థులు ఇతరులు ఉన్నారని కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇక గుర్తింపు పొందిన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను సైతం తెలిపారు. బీజేపీ నుంచి 224, కాంగ్రెస్ పార్టీ నుంచి 223 (మెలుకోట్ నియోజకవర్గంలో సర్వోదయ కర్ణాటక పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది), జేడీఎస్ నుంచి 207, ఆప్ నుంచి 209, బీఎస్పీ నుంచి 133, సీపీఎం నుంచి 4, జేడీయూ నుంచి 8, ఎన్‭పీపీ నుంచి 2 పోటీ చేస్తున్నారు. కాగా, 685 మంది అభ్యర్థులు గుర్తింపు పొందని రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, 978 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.