Congress’s 1st list of candidates out, Siddaramaiah replaces son to contest from Varuna
Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. కాగా, 124 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో స్పష్టమైంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గం కాకుండా, మొన్నటి వరకు పోటీ చేస్తారని ప్రచారం జరిగిన కోలార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా.. తన కొడుకు స్థానమైన వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
చాముండేశ్వరి నుంచి తప్పుకుంటున్నట్లు చాలా రోజుల కిందే చెప్పిన ఆయన.. కోలార్ నుంచి పోటీ చేయనున్నట్లు కూడా తెలిపారు. పలుమార్లు ఆ నియోజకవర్గంలో పర్యటనలు సైతం చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన సర్వేలో అక్కడి నుంచి పోటీ ప్రతికూలంగా ఉందని చెప్పడంతో తన స్థానాన్ని మార్చుకున్నారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే విషయం మాత్రం తెలియలేదు. వాస్తవానికి సిద్ధూ పోటీ గురించి చాలా రోజులుగా చర్చే జరుగుతోంది. దీంతో మొదటి జాబితా వస్తే కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనేది స్పష్టం కాలేదు.
Rahul Press meet: ఏం చేసుకుంటారో చేసుకోండి, తగ్గేదే లేదు.. అనర్హతపై మోదీకి రాహుల్ ఛాలెంజ్
ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పని చేసిన సిద్ధరామయ్య కాగా, మరొకరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్. వీరిద్దరికీ మొదటి జాబితాలోనే చోటు దక్కింది. సిద్ధరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ ఖరారు కాగా, డీకే శివకుమార్ పోటీ కనకపుర నుంచి ఖరారైంది. మొదటి జాబితాలో లింగాయత్ సమాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 20 శాతం టికెట్లు ఆ సామాజిక వర్గానికే కేటాయించారు.
Wayanad: రాహుల్ గాంధీ కోల్పోయిన వయనాడ్ నియోజకవర్గంలో తొందరలో ఎన్నిక?
ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రియాంక్ ఖర్గే సైతం మొదటి జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన చితాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. చాలా స్థానాల్లో సిట్టింగులకే అవకాశం కల్పించిన పార్టీ.. కొన్ని సీట్లలో మాత్రం అభ్యర్థులను మార్చారు. గతంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి కారణమైన పుట్టణ్ణకు తిరిగి టికెట్ లభించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. కాగా, సరిగ్గా ఎన్నికలకు ముందే ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.