Gujarat Polls: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన కూలీ.. డిపాజిట్‭గా 10 వేల రూపాయి నాణేలు

మూడేళ్ల క్రితం గాంధీనగర్‭లోని మహాత్మ మందిర్ వద్ద ఇళ్లు కోల్పోయిన 521 గుడిసెల వాసులే తనను పోటీకి దిగమని చెప్పినట్లు మహేంద్ర తెలిపారు. మహేంద్ర రెండుసార్లు తన నివాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2010లో దండి కుటిర్ మ్యూజియం నిర్మాణం సందర్భంగా ఒకసారి మారగా, 2019లో హోటల్ నిర్మాణం కారణంగా నివాసం మారాల్సి వచ్చింది.

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రోజూ కూలీ పోటికి దిగుతున్నారు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్‭లోని ఒక మురికి వాడను కూల్చి హోటల్ నిర్మించారు. ఆ మురికి వాడకు చెందిన వ్యక్తే నేడు నామినేషన్ వేశాడు. తన స్నేహితుల నుంచి కొంత డబ్బు సాయం తీసుకుని, ఏకంగా పది వేల రూపాయి నాణేలతో నామినేషన్ వేశాడు. గాంధీనగర్ నార్త్ నుంచి పోటీకి దిగుతోన్న ఆ మురికి వాడకు చెందిన వ్యక్తి పేరు మహేంద్ర పత్ని. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచాడు.

మూడేళ్ల క్రితం గాంధీనగర్‭లోని మహాత్మ మందిర్ వద్ద ఇళ్లు కోల్పోయిన 521 గుడిసెల వాసులే తనను పోటీకి దిగమని చెప్పినట్లు మహేంద్ర తెలిపారు. మహేంద్ర రెండుసార్లు తన నివాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2010లో దండి కుటిర్ మ్యూజియం నిర్మాణం సందర్భంగా ఒకసారి మారగా, 2019లో హోటల్ నిర్మాణం కారణంగా నివాసం మారాల్సి వచ్చింది.

ఇక తాజాగా, ఎన్నికల్లో పోటీపై మహేంద్ర స్పందిస్తూ ‘‘నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాను. నా కుటుంబం కూలీ చేసుకుని బతుకుతుంది. రోజూ కూలీ పనికి పోతే కానీ ఇల్లు గడవదు. మాలాగే 521 మంది ఉన్నారు. వారంతా మూడేళ్ల క్రితం తమ గుడిసెల్ని కోల్పోయారు. హోటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం మా అందరినీ ఖాళీ చేయించి, మా గుడిసెల్ని కూల్చేసింది. ఇప్పుడు వాళ్లంతా కలిసి నన్ను ఎన్నికల్లో నిలబడమని కోరారు. వాళ్ల కోరిక మేరకే ఎన్నికల్లో పోటీకి దిగాను’’ అని అన్నాడు.

Marri Sashidhar Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి ఔట్.. 6 ఏళ్ల పాటు బహిష్కరించిన టీపీసీసీ

ట్రెండింగ్ వార్తలు