EC announces by- elections for seven assembly seats in six states
By Polls: తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఎన్నిక నోటిపికేషన్ ఈ నెల 7న రానుంది. ఇక అక్టోబర్ 14వ తేదీన నామిషేన్లు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 15న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు అక్టోబర్ 17.. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. 6న ఫలితాలు విడుదల కానున్నాయి.
కాగా, ఈ ఎన్నికతో పాటు దేశంలోని మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. మునుగోడు షెడ్యూల్ ప్రకారమే ఆ ఎన్నికలు జరుగుతాయి.
తూర్పు అంధేరి (మహారాష్ట్ర)
మోకమ (బిహార్)
గోపాల్గంజ్ (బిహార్)
అదంపూర్ (హర్యానా)
గోల గోకరనాథ్ (ఉత్తరప్రదేశ్)
ధాంనగర్ (ఒడిశా)
ఇక మునుగోడు విషయానికి వస్తే.. అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే అంచనాతో ఈ ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మునుగోడులో గెలిచిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. తన నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించడం కోసమేనని ఆయన రాజీనామా చేసి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో గులాబీ పార్టీకి బలం పెరిగినట్లయింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశాలూ లేకపోలేదు. దీంతో ఆ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
Karnataka Flag: కర్ణాటక జెండాపై రాహుల్ గాంధీ ఫొటో.. మండిపడుతున్న కన్నడ సంఘాలు