Rajasthan Politics: నేను కుర్చీని వదులుకోవడానికి సిద్ధమే. కానీ.. సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను రద్దు చేశారన్న ప్రచారంపై అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో అధికార వ్యతిరేకత లేదని అన్నారు. ఎమ్మెల్యేలపై కొంత ఆగ్రహం, అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు

Assembly Elections 2023: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీపై ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. గెహ్లోట్ ను గద్దె దించేందుకు పైలట్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా.. పైలట్ ను సీఎం కుర్చీ వైపుకు రాకుండా ఉండేదుకు గెహ్లాట్ సైతం అనేక ఎత్తులు వేస్తున్నారు. ఒకానొక సందర్భంలో అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా అవకాశం వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కుర్చీని మాత్రం వదిలేందుకు ఇష్టపడలేదు. దీంతో కాంగ్రెస్ చీఫ్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

ఇక తాజాగా సీఎం కుర్చీ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధమే కానీ, సీఎం పదవే తనను వదలడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సీఎం అవుతారా అన్న ప్రశ్నపై అశోక్ గెహ్లాట్ మొదట హాస్య స్వరంతో ‘కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి సీఎం కాలేరు’ అని అన్నారు. తన ప్రభుత్వ ఆరోగ్య పథకం గురించి వివరిస్తూ, తాను ఈ పదవిని వదిలేయాలనుకుంటున్నానని, కానీ ఈ పోస్ట్ తనను వదిలిపెట్టదని న్నారు. గాంధీ కుటుంబం తనను నమ్మేది ఏదో ఒకటి ఉండాలంటూ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Calcutta High Court: ఆ 2 నిమిషాల ఎంజాయ్‭కి బదులు అమ్మాయిలు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను రద్దు చేశారన్న ప్రచారంపై అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో అధికార వ్యతిరేకత లేదని అన్నారు. ఎమ్మెల్యేలపై కొంత ఆగ్రహం, అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అయితే ముఖ్యమంత్రిపై అలాంటివేవీ లేవని చెప్పారు. ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగుతున్నాయని సీఎం గెహ్లాట్ అన్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారించినప్పుడు, తాను ఈడీ, ఆదాయపు పన్ను, సీబీఐ డైరెక్టర్లతో అపాయింట్‌మెంట్ కోరానని, వారిపై నమ్మకం తగ్గితే దేశం నష్టపోతుందని గెహ్లాట్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు