Karnataka Results: కింగ్ నుంచి కింగ్‭మేకర్.. అక్కడి నుంచి మరెక్కడికో.. చరిత్రాత్మక ఓటమి చవిచూసిన జేడీఎస్

2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన హయాంలోనే పార్టీ విపరీతంగా పుంజుకుంది.

JDS Defeat: జనతాదళ్ నుంచి విడిపోయిన జనతాదళ్ సెక్యూలర్ పార్టీ.. కన్నడ రాజకీయాల్లో (Kannada Politics) తన ప్రభావం చూపిస్తూ వస్తోంది. కర్ణాటక స్థానిక పార్టీగా పేరు ఉన్నప్పటికీ ఏ ఎన్నికలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించలేదు. అయితే చాలా సందర్భాల్లో కింగ్‭మేకర్ (King Maker) పాత్ర పోషించింది. త్రిముఖ పోరును అదునుగా చేసుకుని రెండుసార్లు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లింది. అలాంటి పార్టీ.. ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక ఓటమిని చవి చూసింది.

1999 నాటి ఎన్నికల్లో కేవలం 10 స్థానాలు మాత్రమే సాధించింది. అయితే అప్పుడే పార్టీ కొత్తగా ఏర్పడింది. ఆ పార్టీకి అవే మొట్టమొదటి ఎన్నికలు. ఇక అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన హయాంలోనే పార్టీ విపరీతంగా పుంజుకుంది. ఇక అప్పటి నుంచి పార్టీ క్రమంగా పడిపోతూ వచ్చింది.

సిద్ధూ నుంచి పార్టీ బాధ్యతలు కుమారస్వామి చేతిలోకి వెళ్లిన మొదటి ఎన్నికల్లో (2008 ఎన్నికలు) 28 స్థానాలకు పడిపోయింది. అయితే 2013 ఎన్నికల్లో 40 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం 2018 నాటి ఎన్నికల్లో 37 స్థానాలకు పరిమితమైంది. అయితే ఆసారి ఎన్నికల్లో మాత్రం జేడీఎస్ అట్టడుగుకు పడిపోయింది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అది కూడా కేవలం 13.3 శాతం ఓట్లతో. 1999 తర్వాత పార్టీ సాధించిన అతి తక్కువ సీట్లు, అతి తక్కువ ఓట్లు ఇవే.

Also Read: జేడీఎస్‌కు షాకిచ్చిన కన్నడ ఓటర్లు.. కుమారస్వామి ఆశలు గల్లంతు