MCD elections to be held on December 4
MCD Elections: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, అలాగే డిసెంబర్ 7న ఫలితాల్ని విడుదల చేస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. వాస్తవానికి ఈ ఎన్నికలను ఈ యేడాది మొదట్లోనే నిర్వహించాల్సి ఉంది. అయితే ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కారణంగా ఆలస్యం జరిగింది.
ఈ విషయమై ఢిల్లీ ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ మాట్లాడుతూ ‘‘ఎంసీడీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల అవుతుంది. 14న నామినేషన్‌ల గడువు ముగుస్తుంది. అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 19 ఆఖరి తేదీ. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఇవాళ్టి నుంచే ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉందని ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ చెప్పారు. మొత్తం 250 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని, అందులో 42 వార్డులు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలని విజయ్ దేవ్ తెలిపారు.
Isudan Gadhvi: గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్