Nisha Bangre: సబ్ కలెక్టర్ (ఎస్‌డీఎం) పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన నిషా బాంగ్రేకు చుక్కెదురైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు పార్టీ నుంచి టికెట్ దొరకలేదు. ఆమెకు టికెట్ ఇచ్చేందుకు కమల్‌నాథ్ నిరాకరించారు. వాస్తవనానికి గురువారమే ఆమె కమల్‌నాథ్ సమక్షంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు టికెట్ వస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి చివరికి మొండి చెయే ఎదురైంది.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిషా బంగ్రే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఛింద్వారాలో నామినేషన్ వేసిన అనంతరం కమల్‌నాథ్ ప్రసంగిస్తూ ఈ విషయం స్పష్టం చేశారు. ఆ సమయంలో వేదికపై నిషా బాంగ్రే కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Assembly Elections 2023: హేమామాలిని డాన్స్ చేస్తుందంటూ సొంత పార్టీ నేతే వివాదాస్పద వ్యాఖ్యలు
అంతకుముందు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో నిషా బంగ్రే బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆమ్లా నుంచి తనకు టికెట్ విషయంలో నిషా కమల్‌నాథ్‌తో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే వీరిద్దరి భేటీపై పెద్దగా సమాచారం లేదు. నిషాను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని భావిస్తున్నారు.