Karnataka Polls: ‘బజరంగ్ భలి’ దెబ్బకు మాట మార్చిన కాంగ్రెస్.. ‘బజరంగ్ దళ్’‭ను బ్యాన్ చేస్తామని అనలేదంటూ బుకాయింపు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. బజరంగ్ భలీని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా, ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత బజరంగ్ దళ్ నినాదాలు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

Veerappa Moily

Karnataka Polls: ఇస్లామిక్ సంస్థ అయిన పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు హిందూ సంస్థ అయిన బజరంగ్ దళ్‌ను రద్దు చేస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. బజరంగ్ భలీని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా, ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత బజరంగ్ దళ్ నినాదాలు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

Visakha North Constituency: విశాఖ నార్త్ లో ఎవరెవరు బరిలో దిగబోతున్నారు.. పోటీకి ఆసక్తి చూపని గంటా.. కారణం ఏంటి?

ఏమైతేనేం.. మోదీ సహా రైట్ వింగ్ సంస్థలన్నీ బజరంగ్ భలితో వచ్చిన కొట్టిన దెబ్బ కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే తగిలినట్టుంది. తాము బజరంగ్ దళ్‭ను చేస్తామని చెప్పలేదని, అలాంటిది తమ పార్టీ మేనిఫెస్టోలోనే లేదంటూ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ వివరణ ఇచ్చుకున్నారు. గురువారం ఆయన ఉడిపిలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. “మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్‌ను కర్ణాటక ప్రభుత్వం నిషేధించదు” అని మొయిలీ అన్నారు.

Bihar: నితీశ్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై స్టే విధించిన హైకోర్టు

ఈ విషయం మీద శివకుమార్ మరింత క్లారిటీ ఇస్తారని ఆయన అన్నారు. విద్వేష రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందని, భజరంగ్ దళ్‌ను నిషేధించే ప్రతిపాదన తమ వద్ద లేదని అన్నారు. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠినమైన నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మేనిఫెస్టో పేర్కొందని ఆయన గుర్తు చేశారు.