Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాం రాష్ట్రంలో సాయంత్రం 5 గంటలకు 69.87 శాతం పొలింగ్ నమోదు అయిందని, అలాగే ఛత్తీస్‌గఢ్ లో 5 గంటల వరకు 70.87 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఛత్తీస్‌గఢ్ లో మొదట ఓటింగ్ కాస్త మందకొడిగా సాగినప్పటికీ.. సాయంత్రం జోరు అందుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 6.92గా ఉన్న పోలింగ్.. ఒక్కసారిగా పెరిగి 70.87 శాతానికి వచ్చింది. ఇదే సమయంలో మిజోరాంలో సాయంత్రం ఓటింగ్ కాస్త మందగించింది.
ఇక ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఖైరాఘర్ చుయిఖదాన్ గండాయి జిల్లాలో 76.31% మంది పోలింగ్ నమోదు అయింది. ఇక బీజాపూర్ జిల్లాలో అత్యల్పంగా 40.98% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని మొదటి దశ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
బీజాపూర్ జిల్లా భైరామ్‌ఘర్ బ్లాక్‌లోని సెన్సిటివ్ గ్రామమైన చిహ్కా పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన గ్రామస్థులకు ఓటు వేసిన తర్వాత వారి వేళ్లపై చెరగని సిరా వేయడం లేదు. ఇది అబుజ్‌మద్‌కు ఆనుకుని ఉన్న భైరామ్‌ఘర్ బ్లాక్‌లోని గ్రామం. నక్సలైట్ల భయంతోనే ఇక్కడ గ్రామస్తులు ఇలా చేస్తున్నారని, వారితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేసినా వారు కెమెరాలో ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేరని అధికారులు చెబుతున్నారు. రెండవ కేసు చిహ్కా పోలింగ్ బూత్. ఇక్కడ నక్సలైట్ల బహిష్కరణ తర్వాత కూడా, అంతర్గత ప్రాంతాల్లోని గ్రామస్థులు తమ సొంత ప్రయత్నాలు, మార్గాల పోలింగ్ బూత్ కు వస్తున్నారు. ఓటు వేయడానికి ఏడెనిమిది కిలోమీటర్లు నడుస్తున్నారు. వారిలో ఒక వృద్ధుడు తన కోడలు, కుమార్తెతో వచ్చాడు. నక్సలైట్ల బెదిరింపులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ వీళ్లు తమ ఓటు వేయడానికి రావడం గమనార్హం.