Caste Census: కులగణనపై రాహుల్ గాంధీని తప్పుపట్టిన రవిశంకర్.. ఇందిరా నుంచి నేర్చుకోవాలంటూ చురక

ఇక కులగణన అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి లింకు పెడుతూ రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఎవరి సంఖ్య భారీగా ఉంది, ఎవరి వాటా ఎంత ఉందనే కాంగ్రెస్ నినాదం కాంగ్రెస్‌ పార్టీలో అమలు అవుతుందా లేదా అని ప్రశ్నించారు

Caste Census: రాహుల్ గాంధీ కొద్ది రోజులుగా కులగణనపై విస్తృతంగా మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇస్తున్నారు. ఎవరి జనాభా ఎంతనో వారికంత వాటా ఉండాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా రాహుల్ చేస్తున్న ఈ వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇందిరా గాంధీ నుంచి రాహుల్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ మీడియాలో హల్ చల్ చేస్తోందని, అందులో ఆమె కులమతాలకు అతీతంగా ఎదుగుతున్నట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

‘‘రాహుల్ తన అమ్మమ్మను చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఎవరి ప్రభావం వల్ల అక్కడ (కాంగ్రెస్ పార్టీ) కూర్చున్నారో ఆయన తెలుసుకోవాలి’’ అని రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎన్నికల పర్యటన నిమిత్తం శుక్రవారం రాయ్‌పూర్‌ చేరుకున్న రవిశంకర్‌ ప్రసాద్‌.. బీజేపీ కార్యాలయం ఏకత్మ్‌ కాంప్లెక్స్‌లో మీడియాతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌కు ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. నిజానికి ఆయన ఏ పుస్తకం ఇచ్చినా చదువుతూనే ఉంటారని, కానీ ఆ పుస్తకంలోని ఆంశాన్ని ఏమాత్రం వంటబట్టించుకోరంటూ విమర్శించారు.

ఇది కూడా చదవండి: women fear : ఆడవాళ్లంటే భయంతో 55 ఏళ్లుగా ఇంటికి తాళం వేసుకుని జీవిస్తున్న 71 ఏళ్ల వింత వ్యక్తి

ఇక కులగణన అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి లింకు పెడుతూ రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఎవరి సంఖ్య భారీగా ఉంది, ఎవరి వాటా ఎంత ఉందనే కాంగ్రెస్ నినాదం కాంగ్రెస్‌ పార్టీలో అమలు అవుతుందా లేదా అని ప్రశ్నించారు. ఇందిర, రాహుల్, సోనియా, ప్రియాంక కాంగ్రెస్‌లోకి వచ్చారని, కుటుంబాన్ని దాటి రానివ్వని వారు, దేశ జనాభాకు ఏమిస్తారంటూ చురకలు అంటించారు. కులగణన గురించి మాట్లాడే కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలలో ఆ న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ‘‘ఇది ఒక భ్రమ. గిరిజనులు, వెనుకబడిన వారు, దళితుల కోసం బీజేపీ మాత్రమే ఆలోచిస్తుంది. ఆదివాసీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా చేసినప్పుడు కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. అలాగే రామ్‌నాథ్ కోవింద్‌ విషయంలోనూ అదే జరిగింది’’ అని రవిశంకర్ అన్నారు.