Assembly Elections 2023: 60 మంది అభ్యర్థులకు బీ-ఫాం అందజేసిన కాంగ్రెస్

మరో 19 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. లెఫ్ట్ సహా మరికొన్ని పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనట్లు తెలుస్తోంది.

Telangana Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీలోని 60 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ-ఫాంలు అందజేసింది. మరో 37 మంది అభ్యర్థులకు అందించాల్సింది ఉంది. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక మరో మూడు స్థానాల బీ-ఫాంలను పెట్టాలని ఏఐసీసీ ఆదేశించింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీకి ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

మరో 19 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. లెఫ్ట్ సహా మరికొన్ని పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనట్లు తెలుస్తోంది. కాగా, వనపర్తి, చేవెళ్ల, బోథ్ సెగ్మెంట్ల బీ-ఫాంలు ఏఐసీసీ ఆదేశాల మేరకు పెండింగులో ఉన్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ నవంబర్ 3న ప్రారంభమైంది. నవంబర్ 10 వరకు నామినేషన్లు తీసుకుంటారు. అనంతరం నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఇక వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు కూడా వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.