Bengal Panchayat Polls: బీజేపీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ స్థానాలు గెలిచిన టీఎంసీ

గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 16,436 స్థానాలు గెలుచుకుని మరో 5,380 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 3,665 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 1,597 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది

West Bengal: బెంగాల్ అంటే టీఎంసీ.. టీఎంసీ అంటే బెంగాల్.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా దశాబ్ద కాలానికి పైగా సాధారణ కనిపించే దృశ్యమిది. తాజాగా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే ఒకవడి కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గ్రామ పంచాయతి, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్ లకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలవుతున్నాయి. కాగా, ఈ ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా వైట్ వాష్ చేసేట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికి విడుదలైన ట్రెండ్స్ ప్రకారం.. అన్ని సెగ్మెంట్లలో టీఎంసీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. విపక్ష పార్టీలు అన్ని కలిసినప్పటికీ టీఎంసీ స్థానాల్లో సగం కూడా సాధించలేకపోతున్నాయి.

Mahagathbandhan: మరింత పెరిగిన మహాకూటమి బలం.. తాజాగా మరో 8 పార్టీల మద్దతు

గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 16,436 స్థానాలు గెలుచుకుని మరో 5,380 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 3,665 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 1,597 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. బెంగాల్ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన లెఫ్ట్ పార్టీలు దారుణ ఓటమి దిశగా పయనిస్తున్నాయి. సీపీఎం కేవలం 1,298 స్థానాలు మాత్రమే గెలుచుకుని మరో 775 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక పురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ అయితే మరీ తక్కువగా 1,033 స్థానాలను మాత్రమే గెలుచుకుని మరో 672 స్థానాల్లో లీడింగులో ఉంది. ఈ నాలుగు ప్రధాన పార్టీలు కాకుండా.. ఇతరులు 1,432 స్థానాలు గెలుచుకుని మరో 473 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Revanth Reddy : 24గంటల ఉచిత విద్యుత్.. పక్కా మోసం- సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

ఇక పంచాయతి సమితీల్లో మొత్తం 9,730 స్థానాలకు ఫలితాలు వెలువడుతుండగా.. టీఎంసీ దాదాపు 58 స్థానాలు గెలుచుకుని, 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 8 స్థానాలు, సీపీఎం 6 స్థానాలు, ఇతరులు ఒక స్థానంలో లీడింగులో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా లీడ్ సాధించలేదు. అలాగే జిల్లా పరిషత్ లో 928 స్థానాలు ఉండగా.. టీఎంసీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మిగిలిన ఏ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని కనబడర్చడం లేదు.

ట్రెండింగ్ వార్తలు