Bengal panchayat polls: పంచాయతీ ఎన్నికలనూ వదలని అల్లర్లు.. బెంగాల్‭లో ఇది ఆనవాయితీగా మారిందా?

ఈ అల్లర్లు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. అయినప్పటికీ ఏ వర్గమూ ఎంతమాత్రం తగ్గడం లేదు. వీరిని అదుపు చేయలేక అక్కడి పోలీసు యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇక పార్టీ అధినేతలు వీటిని తగ్గుముఖం పట్టించే విధంగా వ్యవహరించకపోగా, అల్లర్లకు మరింత ఆజ్యం పోసేలానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి

Bengal Politics: ఎన్నికలంటే అల్లర్లు, అల్లర్లంటే ఎన్నికలు.. ఇదీ కొంత కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కనిపిస్తున్న దృశ్యం. సాధారణ ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు లోక్‭సభ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు.. ఎన్నిక ఏదైనా అధికార, విపక్ష పార్టీల మధ్య కొట్లాట కామన్ అయింది. ఒక చేతిలో పార్టీ జెండాలు, మరొక చేతిలో రాళ్లు, కర్రలు.. పోలింగు బూతులో జరిగే పోటీ పక్కన పెడితే.. రోడ్లపై వీరి మధ్య కొనసాగే ఆధిపత్య పోరు ఎక్కువైంది. నిజానికి ఆ రాష్ట్రంలో ఎన్నికల కంటే కూడా అల్లర్లలో బలం చూపించుకుంటున్నారేమో అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

Umar Khalid: జేఎన్‭యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ జైలుకు వెళ్లి 1,000 రోజులు పూర్తి

ఈ అల్లర్లు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. అయినప్పటికీ ఏ వర్గమూ ఎంతమాత్రం తగ్గడం లేదు. వీరిని అదుపు చేయలేక అక్కడి పోలీసు యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇక పార్టీ అధినేతలు వీటిని తగ్గుముఖం పట్టించే విధంగా వ్యవహరించకపోగా, అల్లర్లకు మరింత ఆజ్యం పోసేలానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే.. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతే, రాష్ట్రంలో రెండు రోజులుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, విపక్షాలైన (బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు) మద్దతుదారుల మధ్య కుమ్ములాటలు కొనసాగుతున్నాయి.

Karnataka: ఉచిత బస్సు ప్రయాణం 20 కిలోమీటర్లేనట.. ముహూర్తం ముందు అసలు విషయం చెప్పిన కర్ణాటక సర్కార్

శుక్రవారం ప్రారంభమైన ఈ అల్లర్లు శనివారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఇక ఎప్పటిలాగే అల్లర్లకు కారణం విపక్ష పార్టీలని అధికారపక్షం, అధికార పార్టీ అని విపక్షం ప్రకటనలు చేసేసి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఏ ఒక్కరు అల్లర్లు తగ్గించాలని కానీ, శాంతిని నెలకొల్పాలని కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోని బంకుర, పుర్బ, పశ్చిమ్ బర్దమాన్, బీర్బూం, ముర్షీదాబాద్ జిల్లాల్లో అల్లర్లు తీవ్ర స్థాయిలో కొనసాగాయి.

JP Nadda: ఏపీ రాజధానికి మోదీ శంకుస్థాపన చేశారన్న నడ్డా.. సీఎంగా ఉన్నప్పుడు తానేం చేశారో చెప్పిన నల్లారి కిరణ్

ఇక నామినేషన్ ప్రారంభమైన శుక్రవారం రోజున ఒక కాంగ్రెస్ కార్యకర్తను కాల్చి చంపారు. టీఎంసీ కార్యకర్తలే ఆ దారుణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే వాటిని అధికార పార్టీ తోసిపుచ్చింది. అల్లర్లలో అనేక మందికి గాయాలయ్యాయి. అయినప్పటికీ ఈ అల్లర్లు ఎంతమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. అల్లర్లపై నివేదికలు తీసుకుంటున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని బెంగాల్ ఎన్నికల సంఘం పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు