Bengal Panchayat Polls: బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను మరోసారి చావు దెబ్బకొట్టిన టీఎంసీ!

గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 6,158 స్థానాలు గెలుచుకుని మరో 3,168 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 1,155 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 776 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. బెంగాల్ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన లెఫ్ట్ పార్టీలు దారుణ ఓటమి దిశగా పయనిస్తున్నాయి

West Bengal: బెంగాల్ అంటే టీఎంసీ.. టీఎంసీ అంటే బెంగాల్.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా దశాబ్ద కాలానికి పైగా సాధారణ కనిపించే దృశ్యమిది. తాజాగా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే ఒకవడి కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గ్రామ పంచాయతి, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్ లకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలవుతున్నాయి. కాగా, ఈ ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా వైట్ వాష్ చేసేట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికి విడుదలైన ట్రెండ్స్ ప్రకారం.. దాదాపు అన్ని సెగ్మెంట్లలో టీఎంసీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. విపక్ష పార్టీలు అన్ని కలిసినప్పటికీ టీఎంసీ స్థానాల్లో సగం కూడా సాధించలేకపోతున్నాయి.

TSPSC Question Paper Leak : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ.. 77కు చేరిన అరెస్టుల సంఖ్య

గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 6,158 స్థానాలు గెలుచుకుని మరో 3,168 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 1,155 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 776 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. బెంగాల్ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన లెఫ్ట్ పార్టీలు దారుణ ఓటమి దిశగా పయనిస్తున్నాయి. సీపీఎం కేవలం 605 స్థానాలు మాత్రమే గెలుచుకుని మరో 387 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక పురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ అయితే మరీ తక్కువగా 248 స్థానాలను మాత్రమే గెలుచుకుని మరో 212 స్థానాల్లో లీడింగులో ఉంది. ఈ నాలుగు ప్రధాన పార్టీలు కాకుండా.. ఇతరులు 1,367 స్థానాలు గెలుచుకుని మరో 532 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Ketireddy Peddareddy : 2024లో జేసీ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టి చూపిస్తా : కేతిరెడ్డి పెద్దారెడ్డి

ఇక పంచాయతి సమితీల్లో మొత్తం 9,730 స్థానాలకు ఫలితాలు వెలువడుతుండగా.. టీఎంసీ దాదాపు 261 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలన ఏ పార్టీలు ఇప్పటి వరకు ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలోకి రాలేదు. అలాగే జిల్లా పరిషత్ లో 928 స్థానాలు ఉండగా.. టీఎంసీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా మిగిలిన ఏ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని కనబడర్చడం లేదు.

ట్రెండింగ్ వార్తలు