Assembly Elections 2023: తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన వసుంధరకే చెక్ పెట్టిందా? రాజస్థాన్ రాకుమారి దియా కుమారి గురించి తెలుసుకోండి

మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడలేదని, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో శిక్షణ ముగించుకుని వెళ్లినప్పుడు మళ్లీ మళ్లీ కలవాలని అనిపించిందని యువరాణి దియా రాసింది.

Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు 41 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు ఎంపీల పేర్లు ఉన్నాయి. విద్యాధర్ నగర్ స్థానం నుంచి దియా కుమారిని బీజేపీ పోటీకి దింపింది. ఇటీవలి కాలంలో దియా కుమారి విషయంలో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. రాజస్థాన్ రాజకీయాల్లో ఆమెకు పెద్దపీట వేస్తారనే చర్చ సాగుతోంది. వసుంధర రాజేకు దియా కుమారి ప్రత్యామ్నాయం కానుందా లేక ఇది బీజేపీ ఎన్నికల మాయగా మారుతుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

దియా కుమారి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా?
బీజేపీ నుంచి దియా కుమారి పోటీకి దిగుతుందన్న వార్త వచ్చిన వెంటనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ సురక్షితమైన సీటుగా భావించే విద్యాధర్ నగర్ స్థానం నుంచి ఆమెను పోటీకి దింపింది. మాజీ ఉపరాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి భైరోన్ సింగ్ షెకావత్ సమీప బంధువు అయిన నర్పత్ సింగ్ రాజ్వీ ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థానం నుంచి టికెట్ ఇవ్వడంతో బీజేపీ పెద్ద ప్లానే వేసిందనే చర్చలు మరింత బలపడ్డాయి.

ఇది కూడా చదవండి: Dussehra 2023 : పాండవులకు పాలపిట్టకు సంబంధమేంటి..?దస‌రా రోజు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి..?

వసుంధర రాజే సహకారంతో రాజకీయాల్లోకి దియా ఎంట్రీ
దియా కుమారి రాజకీయాల్లోకి రావడానికి మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహకరించారు. 2013లో జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో దియా కుమారి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బీజేపీలో చేరారు. అనంతరం, దియా కుమారికి సవాయి మాధోపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ ఇచ్చారు. 2013 నుంచి 2018 వరకు సవాయి మాధోపూర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత, 2019 లోక్‌సభ ఎన్నికలలో రాజ్‌సమంద్ నుంచి ఎంపీ బరిలో దింపారు. ఆ స్థానం నుంచి ఆమె గెలిచారు.

టిక్కెట్ల పంపిణీలో వసుంధర రాజేను పట్టించుకోలేదని, ఆమె సూచించిన పేర్లను పక్కన పెట్టారని తొలి జాబితాను బట్టి స్పష్టమవుతోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా టిక్కెట్ల పంపిణీలో ఎలాంటి వర్గపోరు ఉండదని హైకమాండ్ కూడా స్పష్టం చేసింది. మొత్తమ్మీద బీజేపీ ఎన్నికలను ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనే కేంద్రీకరిస్తానని స్పష్టం అవుతోంది.

దియా కుమారి ప్రేమకథ చిత్రమైనది
జైపూర్ రాజకుటుంబానికి చెందిన రాజ్‌సమంద్ ఎంపీ, యువరాణి దియా ప్రేమకథ చాలా చిత్రమైనది. వీరి ప్రేమకథ గురించి మొదట్లో ఎవరికీ తెలియకపోయినా 23 ఏళ్ల క్రితం వెలుగులోకి వచ్చేసరికి వార్తల్లో నిలిచింది. వాస్తవానికి, రాజకుటుంబం నుంచి వ్యతిరేకత కారణంగా యువరాణి దియా 1994లో ఢిల్లీ కోర్టులో సాధారణ వ్యక్తి అయిన నరేంద్ర సింగ్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది. రెండేళ్ల తర్వాత తల్లి పద్మినీదేవికి పెళ్లి విషయం చెప్పింది. తర్వాత జైపూర్, రాజస్థాన్ లలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనం అయింది.

ఇది కూడా చదవండి: Red Sandalwood Seized : తిరుపతిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం.. 25 మంది స్మగ్లర్లు అరెస్టు

యువరాణి దియా జైపూర్ మాజీ మహారాజా సవాయి భవానీ సింగ్, రాణి పద్మినీ దేవిలకు ఏకైక సంతానం. ఆమె మోడరన్ స్కూల్, న్యూ ఢిల్లీ, మహారాణి గాయత్రీ దేవి గర్ల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించింది. యువరాణి దియా కుమారి తదుపరి చదువుల కోసం లండన్ వెళ్లింది. దీని తరువాత, యువరాణి దియా రాజభవనం ఖాతాలను చూస్తున్నప్పుడు, ఆమె నరేంద్ర సింగ్‌ను కలుసుకుంది. దియా కుమారి స్వయంగా తన ప్రేమకథను తన బ్లాగ్ రాయల్టీ ఆఫ్ రాజ్‌పుతానాలో రాయడంతో ఇది బహిరంగమైంది. ఆయన వారి కుటుంబంలోనే ఒక చార్టర్డ్ అకౌంటెంట్.

మొదటి చూపులో ప్రేమ కాదు
మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడలేదని, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో శిక్షణ ముగించుకుని వెళ్లినప్పుడు మళ్లీ మళ్లీ కలవాలని అనిపించిందని యువరాణి దియా రాసింది. తమ సంబంధం స్నేహం కంటే గొప్పదని నేను గ్రహించానని, ఈ విషయం గురించి అమ్మతో మాట్లాడినప్పుడు, ఆమె షాక్ అయ్యిందని, అలాగే రాజకుటుంబంలో వివాహం చేసుకోవాలని సూచించనిట్లు పేర్కొంది. అనంతరం ఆమెకు పెళ్లి చూపులు రావడం ప్రారంభించాయి. మరొకవైపు నరేంద్ర సింగ్ తో ప్రేమాయణం. ఇలా ఆరేళ్లపాటు అంనతరం 1994లో ఆర్యసమాజ్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సంగతి రెండేళ్ల వరకు తల్లిదండ్రులకు చెప్పలేదు.

దియా పెళ్లిని వ్యతిరేకించారు
యువరాణి దియా కుమారి, నరేంద్ర కుమార్ సింగ్ ఒకే గోత్రానికి చెందిన వారు కావడంతో రాజ్‌పుత్ సంఘం వారు వివాహాన్ని వ్యతిరేకించారు. దీంతో రాజా భవానీ సింగ్ రాజ్‌పుత్ మహాసభ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఈ గొడవ వరుసగా 19 ఏళ్ల పాటు కొనసాగింది. కొన్నాళ్ల క్రితం ఈ ప్రేమకథ వేరే మలుపు తిరిగింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రిన్సెస్ దియా కుమారి భర్త నరేంద్ర సింగ్‌తో సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇద్దరూ చాలా కాలంగా విడివిడిగా జీవిస్తున్నారు.

ఇది కూడా చదవండి: JanaSena: జనసేనకు షాక్.. ఇక భరించలేను, ఓర్పు, సహనం నశించిందంటూ కీలక నేత రాజీనామా

అయితే మళ్లీ కలిసి జీవించేందుకు ప్రయత్నించి అంతలోనే విడిపోయారు. 2019 ప్రారంభంలో వారిద్దరి అంగీకారంతో కోర్టు వారికి విడాకులు ఇచ్చింది. వీరికి ఇద్దరు కుమారులు పద్మనాభ్ సింగ్, లక్ష్యరాజ్ సింగ్, ఒక కుమార్తె గౌరవి ఉన్నారు. ఎంపీ దియా కుమారి తన కుటుంబ వారసత్వ సంపద సిటీ ప్యాలెస్, జైఘర్ కోట, ఇతర భవనాలు, వారసత్వాన్ని పరిరక్షిస్తున్నారు.