Karnataka polls: నాయకులు పార్టీ నుంచి వెళ్లినా ఆ సామాజికవర్గ ఓట్లు మాత్రం 101% బీజేపీతోనే అంటున్న యడియూరప్ప

లీడర్లు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన అది ఓటర్ల మీద ప్రభావం చూపిందని, లింగాయత్ ఓటర్లు 101 శాతం తమ పార్టీతోనే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా రోజుల క్రితమే ఎలక్టోరల్ రాజకీయాల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. పార్టీలో మాత్రం కీలకంగానే ఉన్నారు

BS Yediyurappa

Karnataka polls: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్ సామాజికవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. పార్టీ ఏదైనా ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకులే ఎక్కువగా ఉంటారు. అంతే కాకుండా కీలక స్థానాల్లో కొనసాగుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీలోని లింగాయత్ లీడర్లుగా ఒక్కొక్కరుగా గెట్టుదాటుతున్నారు. ఇది లింగాయత్ సామాజిక వర్గం మీద రాజకీయ ప్రభావం చూపుతుందని అంటున్నారు. వచ్చే నెల 10న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇది బీజేపీని బాగా దెబ్బతీస్తుందని కూడా అంటున్నారు.

Himachal Govt : గంజాయి పంటకు చట్టబద్దం .. ఆదాయం పెంచుకునే యోచనలో ప్రభుత్వం

అయితే ఇలాంటి ప్రచారాన్ని కర్ణాటక బీజేపీ ప్రముఖుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కొట్టిపారేశారు. లీడర్లు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన అది ఓటర్ల మీద ప్రభావం చూపిందని, లింగాయత్ ఓటర్లు 101 శాతం తమ పార్టీతోనే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా రోజుల క్రితమే ఎలక్టోరల్ రాజకీయాల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. పార్టీలో మాత్రం కీలకంగానే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ వంటి నేతలు పార్టీని వీడడంపై బుధవారం మీడియాతో స్పందించారు.

Maharashtra: ఎన్సీపీతో చేతులు కలపడంపై బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన ఏక్‭నాథ్ షిండే

‘‘మేము ఆయనకు (జగదీష్ షెట్టర్) రాజ్యసభ సీటు ఇవ్వడమే కాకుండా కేంద్రమంత్రిని చేస్తామని చెప్పారు. అమిత్ షా కూడా ఈ హామీ ఇచ్చారు. పార్టీని వీడి ఆయన తప్పు చేశారని నేను అనుకుంటున్నాను. ప్రతి సందర్భంలోనూ ఆయనకు చాలా మద్దతు ఇచ్చాము. కానీ దాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. మేము ఆయనను స్పీకర్ చేశాం, మంత్రిని చేశాం. ముఖ్యమైన పదవులు ఇచ్చాం. పార్టీని వీడొద్దని నేను ఆయనకు చెప్పాను కూడా’’ అని యడియూరప్ప అన్నారు.