Site icon 10TV Telugu

10TV Edu Visionary 2025: 10టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా మంచి పని చేసింది: మురళీ మోహన్

10tv Edu Visionary 2025

10tv Edu Visionary 2025

10TV Edu Visionary 2025: విద్యారంగంలో విశేషమైన సేవలందించిన వారిని 10టీవీ ఘనంగా సత్కరించింది. 10TV Edu Visionary 2025 వేదికపైకి వారిని తీసుకొచ్చింది. Coffee Table Book విడుదల చేసింది.

ఇందులో పాల్గొన్న ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడారు. “హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందుతోందో మన అందరికీ తెలుసు. మనకు తెలిసిన హైదరాబాద్ 20 ఏళ్ల క్రితం ఎలా ఉంది? 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది?

ఐదేళ్ల క్రితం ఎలా ఉంది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎలా ఉంది అని చూస్తే.. అద్భుతమైన అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్. ఇవాళ భారతదేశంలో ఉన్న ముఖ్య పట్టణాల్లో హైదరాబాద్ ఐదు-ఆరో స్థానంలో ఉంది.

ఔటర్ రింగ్ రోడ్లు గాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లు గానీ, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్ కానీ ఎన్నో వచ్చాయి. అద్భుతమైన విద్యా సంస్థలు వచ్చాయి. విద్యార్థులు.. ఏమేమి కాలేజీలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏం కోర్సులు ఉన్నాయి?

ఫీజులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం చాలా ఉంది. పేపర్లు చూసుకోనో లేకపోతే ఇంటర్నెట్ లోకి వెళ్లో చూసుకోవడం చాలా కష్టమైన పరిస్థితి. ముఖ్యమైన విద్యా సంస్థల వివరాలన్నీ కూడా తెలియజేయడం కోసం 10టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా మంచి పని చేసింది.

ఇప్పుడు గవర్నమెంట్ ఫీజులు కూడా ఫిక్స్ చేస్తున్నప్పటికీ కూడా.. కాలేజీల్లో అదనపు చార్జీలుగా చాలా ఎక్కువగా చార్జ్ చేస్తున్నారు. మీకు ఎలా తెలుసు అని మీరు ఎవరిన్నా అడగొచ్చు నన్ను.

నేను మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టుకుని, బాగా తెలివితేటలు ఉన్న పిల్లలను సెలెక్ట్‌ చేసి కాలేజీల్లోకి పంపిస్తున్నా. కానీ అక్కడికి వెళితే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా ఫీజు అంటున్నారు. ఏమిటో అర్థం కావటం లేదు. ఆ కాలేజీల్లో అదనపు చార్జెస్ అని చెప్పి చాలా వసూలు చేస్తున్నారు” అని చెప్పారు.

Exit mobile version