10TV Edu Visionary 2025: విద్యా రంగానికి దిశానిర్దేశం చేస్తున్న మహనీయులను సత్కరించే వేదికగా “10TV Edu Visionary 2025” నిలిచింది. విద్యా పరంగా స్ఫూర్తిదాయకమైన కృషి చేసిన వారిని గుర్తించి గౌరవించే లక్ష్యంతో ఈ వేడుకను 10టీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం 10టీవీలో చూడొచ్చు..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేకంగా రూపొందించిన “10TV Edu Visionary 2025 Coffee Table Book” ను ఆవిష్కరించారు. విద్యా రంగానికి ప్రాణం పోసే విద్యా దార్శనికుల కృషిని ఆ పుస్తకంలో ప్రతిబింబింపజేశాం.
ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. విద్యా పట్ల విశిష్టమైన సేవలు అందించిన వారందరికీ సత్కారాలు, అవార్డులు ప్రదానం చేసి మరింత ప్రోత్సహించింది 10టీవీ. విజేతలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేసి వారి కృషిని గుర్తించింది.
భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేది విద్య. విద్య ద్వారా సమాజం మారుతుంది. విద్యా ప్రేరణ కలిగించే వారిని గుర్తించి గౌరవించడం ఎంతో గొప్ప పని. ఈ కార్యక్రమం మరింత మందికి స్ఫూర్తినిస్తుంది.
విద్యారంగంలో విశిష్ట కృషి చేసిన వారిని ముందుకు తీసుకురావడమే “Edu Visionary” లక్ష్యం. ఈ పేరుతో రూపొందించిన ఈ వేదిక రాబోయే తరాలకు మార్గదర్శకత్వం అందిస్తుంది.
అవార్డులు అందుకున్నవారు తమ అనుభవాలను పంచుకుంటూ, విద్యారంగం అభివృద్ధికి తమ శక్తివంచనలేని కృషి కొనసాగిస్తామని చెప్పారు. విద్యా దార్శనికుల కృషిని కీర్తిస్తూ సాగిన ఈ వేడుక, ఆత్మీయ వాతావరణంలో అద్భుతంగా ముగిసింది. రేపు సాయంత్రం ఈ ప్రోగ్రాంను 10టీవీలో చూడొచ్చు.