10TV Gram Swarajyam
Grama Swarajyam: సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధి సాధకులు. గ్రామ పాలనకు సర్పంచ్ ప్రధాన నాయకుడు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత సర్పంచ్‌లది. వారిని ‘సర్పంచ్‌ల సమ్మేళనం-2025’ కార్యక్రమంతో ఒకే చోటికి తీసుకొచ్చింది 10టీవీ. రాష్ట్రం నలుమూలల నుంచి సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
10టీవీ నిర్వహించిన ఈ సర్పంచ్‌ల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, విద్యావేత్త మల్క కొమరయ్య, ఎమ్మెల్యే యెన్న శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, బల్మూరి వెంకట్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు.