×
Ad

10TV Grama Swarajyam : ప్రజలు మీ నుండి ఏం కోరుకుంటున్నారో అది చేయండి : ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్

10TV Grama Swarajyam: గ్రామ స్వరాజ్యం పేరుతో ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన 10టీవీ యాజమాన్యంకు, సిబ్బంది మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ (Dasoju Sravan) అన్నారు.

Dasoju Sravan

10TV Grama Swarajyam : గ్రామ స్వరాజ్యం పేరుతో ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన 10టీవీ యాజమాన్యంకు, సిబ్బంది మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ (Dasoju Sravan) అన్నారు. 10టీవీ గ్రామ స్వరాజ్యం.. ‘సర్పంచ్‌ల సమ్మేళనం-2025’ కార్యక్రమంలో దాసోజు శ్రావణ్ పాల్గొని మాట్లాడారు.

Also Read : 10TV Grama Swarajyam : 10టీవీ ‘సర్పంచ్‌ల సమ్మేళనం- 2025’లో కరీంనగర్ జిల్లా సర్పంచ్‌ల మనోగతం..

రాజ్యాంగ నిబద్దత.. రాజ్యాంగ పరమైన బాధ్యత కలిగిన గౌరవప్రదమైన రాజ్యాంగ వ్యక్తులు సర్పంచ్‌లు. కాబట్టి.. మీ గ్రామంలో మీరే రాజులు. మీరు ఎవరికి సర్వెంట్లు కాదు.. ఎవరి ముందు తలవొంచాల్సిన పనిలేదు. రాజ్యాంగం సర్పంచ్‌లకు పవర్‌ఫుల్ రోల్ ఇచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ముందుకుసాగాలని దాసోజు శ్రవణ్ సూచించారు. సర్పంచ్‌లకు 29 విధులు ఉంటాయి. వాటిపై నూతన సర్పంచ్‌లు అవగాహన పెంచుకోవాలని అన్నారు.

రాజకీయాలు, పనిచేసే క్రమంలో మన ఇంటిని, మన ఒంటిని గుళ్లచేసుకునేలా రాజకీయాలు చేయకుండా.. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా ఖర్చు చేస్తూ తద్వారా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని దోసోజు శ్రవణ్ నూతన సర్పంచ్ లకు సూచించారు.