Site icon 10TV Telugu

10TV Edu Visionary 2025 Coffee Table Book లాంచ్.. అవార్డులు అందుకున్న 42 మంది వీళ్లే

10tv Edu Visionary 2025 Coffee Table Book

10tv Edu Visionary 2025 Coffee Table Book

విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10TV Edu Visionary 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10TV Edu Visionary 2025 Coffee Table Book లాంచ్ ఘనంగా జరిగింది.

విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులైన విద్యావేత్తలు, విద్యాసంస్థల ప్రతినిధులను సత్కరించేందుకు 10TV Edu Visionary Coffee Table Book 2025ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమ సమర్పణ పౌల్ట్రీ ఇండియా, పవర్డ్ బై తెలుగుప్రభ. ఈ కార్యక్రమ ఉద్దేశం.. విద్యారంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వారిని సత్కరించి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడం.

ఈ కార్యక్రమంలో 10TV Edu Visionary Coffee Table Book 2025 ని ఆవిష్కరించి, పంపిణీ చేశారు. ఇందులో
ముఖ్య అతిథిగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ప్రత్యేక అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త, సీనియర్ నటుడు, సినీ నిర్మాత మురళీ మోహన్, గౌరవ అతిథులుగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ జేడీ లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

కార్యక్రమంలో పలు విద్యా సంస్థలు, సంస్థలు, ప్రతినిధులకు సత్కారాలు జరిగాయి.

10టీవీ లాంచ్‌ చేసిన Coffee Table Bookని ఇక్కడ చూడండి..

Exit mobile version