Air India Crash: భారత విమానయాన చరిత్రలోనే ఇదే అతిపెద్ద బీమా పరిహారంగా రికార్డు

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రమాదాల్లో ప్రమాద భీమా పరిహారాన్ని ఎలా లెక్కిస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. విమాన ప్రమాదాల్లో భీమా పరిహారం అంతర్జాతీయ నిబంధనలు, దేశీయ చట్టాలు, భీమా పాలసీల ఆధారంగా నిర్ణయిస్తారు. మన దేశంలో 2009లో అమల్లోకి వచ్చిన మాంట్రియల్ కన్వెన్షన్–1999 పరిహారం లెక్కల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.