Pushpa 2 Stampede: ‘శ్రీ తేజ్’ కుటుంబానికి వేణు స్వామి రెండు లక్షల ఆర్థిక సాయం.. అల్లు అర్జున్ జాతకంపై కామెంట్స్

పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. తొక్కిసలాటలో గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాలుడు శ్రీ తేజ్‌ కోసం మృత్యుంజయ హోమం సొంత ఖర్చులతో చేస్తానని చెప్పి.. రెండు లక్షల చెక్కును రేవతి భర్త భాస్కర్ కు అందజేశారు వేణు స్వామి. వచ్చే ఏడాది మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగా లేదని... ఆ తర్వాత బాగుందని వేణు స్వామి చెప్పారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి