Ayodhya Sri Ram Song : అయోధ్య శ్రీరామ్ స్పెషల్ సాంగ్ విన్నారా? అమెరికా NRI సమర్పణలో..

అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వ్యక్తి సమీర్ పెనకలపాటి ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సంస్థ స్థాపించి 'అయోధ్య శ్రీరామ్' అనే పాటతో బ్యానర్ ని మొదలుపెట్టారు.

Ayodhya Sri Ram Song : అయోధ్య రామమందిర ప్రారంభిత్సవం నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాముడిపై పలు ప్రత్యేక గీతాలు వచ్చాయి. అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వ్యక్తి సమీర్ పెనకలపాటి త్వరలోనే సినిమా నిర్మాణంలోకి రాబోతున్నారు. ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సంస్థ స్థాపించి ‘అయోధ్య శ్రీరామ్’ అనే పాటతో బ్యానర్ ని మొదలుపెట్టారు.

యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ సారధ్యంలో ‘అయోధ్య శ్రీరామ్’ గీతాన్ని సత్య కశ్యప్ తో కలిసి చిన్మయి, స్నిఖిత, శ్రాగ్వి పాడారు. తెలుగులో ఈ పాటని చిరంజీవి ఎన్ని రాయగా హిందీలో తన్వీర్ ఘజ్వి రాశారు. రాముడి మీద చక్కగా రాసిన ఈ పాట మీరు కూడా వినేయండి.

ట్రెండింగ్ వార్తలు