Malla Reddy: రాహుల్ జోడో యాత్ర.. మిగతా పార్టీల చోడో యాత్ర: మల్లారెడ్డి

Medchal BRS MLA Malla Reddy: రాహుల్ గాంధీ రెండోసారి జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు పోయినయి అంటూ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి సెటైర్లు వేశారు.

ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్.. ఇలా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లిపోయాకా ఇంకా మిగిలి ఉన్నది రాహుల్ గాంధీ ఒక్కరేనని అన్నారు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. రాహుల్ గాంధీ రెండోసారి జోడోయాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు పోయినయని తనదైన శైలిలో మల్లారెడ్డి సెటైర్లు వేశారు.