భీకరంగా సాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో, ఇజ్రాయెల్ వాడుతున్న ఓ టెక్నాలజీ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఎనిమిది ఇరాన్ డ్రోన్లను ‘బరాక్ మాగెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’తో అడ్డుకుంది ఇజ్రాయెల్. దీంతో ఈ బరాక్ మాగెన్ టెక్నాలజీ అంటే ఏమిటనే ఆసక్తి వ్యక్తమవుతోంది.
బరాక్ మాగెన్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసినది. వాయుమార్గంలో వచ్చే ఏవైనా ముప్పులను ఎదుర్కొనేలా ఈ వ్యవస్థ రూపొందించారు. ఈ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ పాత్ర ఎంతో కీలకం. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి