కడప కార్పొరేషన్ మీటింగ్‌లో ఉద్రిక్తత… ఎమ్మెల్యేకు కుర్చీపై మేయర్ ఫైర్

కడప కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ రసవత్తరంగా మారింది. కార్పొరేషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో సమావేశ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే మాధవి రెడ్డికి స్టేజ్‌పై కుర్చీ వేయలేదన్న కారణంగా మీటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి ఎమ్మెల్యే మాధవి రెడ్డికి స్టేజ్‌పై కుర్చీ ఏర్పాటు చేశారు. అయితే కుర్చీ ఏర్పాటు చేయడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి కుర్చీ ఏర్పాటు చేశారని ఫైర్‌య్యారు. అటు కడప కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.