ఇప్పుడు గోల్డ్ తాకట్టు అంత ఈజీ కాదు… కొన్న రసీదులు కావాల్సిందేనా? అసలు ఆర్బీఐ కొత్త రూల్స్ ఏంటి?

గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్లు తాకట్టుకు సంబంధించి ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్లు విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఇష్టం వచ్చినంత మొత్తంలో వ్యక్తి బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు వీలు ఉండదు. ఒక వ్యక్తి ఎంత మొత్తంలో గోల్డ్, సిల్వర్ తాకట్టు పెట్టాలో ఆర్బీఐ గరిష్ట పరిమితిని విధించింది. బంగారం, వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సొమ్ముతో మనీ లాండరింగ్ చేస్తున్నారా అనే విషయంపై బ్యాంకులు ఎప్పటికప్పుడు పక్కాగా తనిఖీ చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.