Visakha Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మరోసారి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు దుకాణాలు దగ్ధం అయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆకతాయిలు నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. సింగరేట్ కాల్చి దుకాణాలపై వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, మత్స్యకారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.