×
Ad

ఆగిన ట్రేడింగ్.. MCXలో పెద్ద టెక్నికల్ సమస్య, ఏమి జరుగుతోంది?

MCX లో కొత్త సాంకేతిక లోపం తలెత్తింది. ఇటీవలే టీసీఎస్ డెవలప్ చేసిన కొత్త ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ కు MCX మారింది.

  • Publish Date - October 28, 2025 / 02:01 PM IST

టెక్నికల్ ఇష్యూతో MCXలో ట్రేడింగ్ ఆగిపోయింది ఉదయం 10 గంటలు దాటిన MCXలో ఇంకా ట్రేడింగ్ ప్రారంభం కాలేదు ఉదయం 10 గంటలకు ట్రేడింగ్ ప్రారంభం అవుతుందని చెప్పినప్పటికీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. డిజాస్టర్ రికవరీ ప్లాట్‌ఫామ్‌ నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తామని MCX తెలిపింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా MCX లో ఇలాంటి టెక్నికల్ సమస్యలు చాలాసార్లు వచ్చాయి. ఈ సంవత్సరం జూలై నెలలో కూడా ఒక సమస్య వచ్చి, ట్రేడింగ్ ఒక గంట ఆలస్యంగా మొదలయ్యాయి.