Group-1 Mains Result: సీబీఐ విచారణ జరిపించాలంటూ.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు.. అసలేం జరిగిందంటే?

గ్రూప్-1 పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరును కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో నిరుద్యోగుల పక్షాన, పేపర్ లీకేజీల వంటి అంశాలపై గట్టిగా పోరాడిన బండి సంజయ్, ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని కౌశిక్ రెడ్డి నిలదీశారు. సీఎం రేవంత్‌పై సీబీఐ విచారణ జరిగేలా బండి సంజయ్ చొరవ చూపాలని కౌశిక్ రెడ్డి కోరారు.