Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల పర్యటన సందర్భంగా కారు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు అడ్డొచ్చాయి. వాటిని గమనించిన పవన్ వైనకకు ఒరిగారు. కారుపైన పడుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. గతంలోనూ పవన్ కల్యాణ్‌కు పలుసార్లు త్రుటిలో ప్రమాదాలు తప్పాయి.