Lal Salaam : లాల్ సలామ్ నుంచి మొదటి సింగిల్ వచ్చేసింది..

విష్ణు విశాల్ హీరోగా రజిని ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ ని రిలీజ్ చేశారు.

Lal Salaam : సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా రజిని ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. హిందూ ముస్లిం గొడవలకు స్పోర్ట్స్ టచ్ ఇస్తూ ఐశ్వర్యా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణు విశాల్ క్రికెట్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. మాజీ భారత్ క్రికెటర్ కపిల్ దేవ్ ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి వచ్చేందుకు సిద్దమవుతుంది. ఇక ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీం టీజర్, సాంగ్స్ తో సందడి చేస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ ని రిలీజ్ చేశారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.