సలార్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుండడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కోసం క్యూ కడుతున్నారు స్టార్ హీరోలు. రామ్ చరణ్, నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ సంచలనాలు సృష్టిస్తుండడంతో ప్రశాంత్ నీల్ పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని, ప్రస్తుతం మోస్ట్ పాపులర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు.