Kalki 2898AD : నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా భారీగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898AD’. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ సినిమా అవుతుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాలో కొత్త రకం గన్స్ ని ఎలా తయారు చేశారో చూపిస్తూ ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.