×
Ad

బంగారంపై పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి: సెబీ హెచ్చరిక!

బంగారం ఇప్పుడు పెట్టుబడిదారులకు నిజంగానే కాసుల వర్షం కురిపిస్తోంది. గత ఏడాది కాలంలో పసిడి ధరలు దాదాపు రెట్టింపు లాభాలను అందించడంతో, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు గోల్డ్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, ఈ హడావిడిలో చాలామంది కొన్ని చిన్నపాటి తప్పులు చేస్తున్నారు. అవే వారిని నట్టేట ముంచుతున్నాయి, ఆందోళనకు గురిచేస్తున్నాయి.

  • Publish Date - November 11, 2025 / 11:11 AM IST

ఒకవేళ మీరు గోల్డ్ పై పెట్టుబడి పెట్టిన సంస్థ లేదా యాప్ మూతపడినా, దివాళా తీసినా పెట్టుబడిదారులు నష్టపోవడం ఖాయమని సెబీ వార్నింగ్ ఇచ్చింది. సెబీ కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చింది అవేంటంటే?

  1. డిజిటల్ గోల్డ్‌ సర్వీసెస్ అందించే సంస్థల వివరాలను నిపుణులతో చెక్ చేసుకోవాలి.
  2. ఆ సంస్థల యాప్‌లకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేసుకోండి.
  3. గోల్డ్ ఈటీఎఫ్‌లు (ETFs), ఈజీఆర్‌లను (EGRs) డిమాట్ ఖాతా ద్వారా మాత్రమే కొనాలి.
  4. ఆన్‌లైన్‌లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి మోసపోవద్దు.
  5. నకిలీ సంస్థలు, యాప్‌లలో పెట్టుబడులు పెట్టవద్దు, ఒకవేళ ఆ సంస్థ దివాళా తీస్తే మొత్తం పెట్టుబడులు నష్టపోతారు.
  6. ఇప్పటికే ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టి ఉంటే, వెంటనే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకోండి.
  7. పెద్దగా పేరు లేని సంస్థల్లో కాకుండా, సెబీ నియంత్రణలోని సంస్థల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి.

పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.