Rythu Bharosa: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రేపటి నుంచి ‘రైతు భరోసా అమౌంట్’ రైతుల అకౌంట్లోకి…

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైతు భరోసా నిధుల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిధులను విడుదల చేసేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ సిద్ధమైంది. రేపటి నుంచి వచ్చే 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో విడతల వారీగా రైతు భరోసా నిధులను జమ చేయేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.