TG New Ministers Portfolios: కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై ఉత్కంఠ
తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇదే విషయమై ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కేసి వేణుగోపాల్ తో గంటపాటు ఇవాళ ఖర్గే, రాహుల్ తో రెండు గంటల పాటు చర్చించారు. కొత్త మంత్రులకు శేఖల కేటాయింపుతో పాటు పలువురు మంత్రుల శాఖల మార్పుపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణలో భారీ బహిరంగ సభల ఏర్పాటుకు తేదీల ఖరారు పైన చర్చించారు. ఈ సభలకు రావాలని ఖర్గే, రాహుల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.